కొమరోలు మండలం హనుమంతురాయునిపల్లి గ్రామ సమీపంలోని దామర్ల చెరువు నుంచి తూముల ద్వారా నీటి వృధా అవుతుందన్న విషయాన్ని గుర్తించిన స్థానిక ఇరిగేషన్ అధికారులు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. జెసిబి సహాయంతో మరమ్మతులు చేపట్టి నీటి వృధాని అరికట్టారు. భవిష్యత్తులో రైతులకు నీటి సమస్య తలెత్తకూడదన్న ఆలోచనతో చర్యలు తీసుకున్నామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. స్పందించిన అధికారులను రైతులు అభినందిస్తున్నారు.