కొమరోలు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి గాయాలు

75చూసినవారు
కొమరోలు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి గాయాలు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహన దారుడిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిన సంఘటన గురువారం జరిగింది. ప్రమాదంలో రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామానికి చెందిన సుంకరి మౌలాలిగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రుడిని అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్