ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో బుధవారం పోలీసులు దొంగతనాలు అరికట్టే అంశంలో ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక ఎస్సై నాగరాజు ఆటో మైక్ సెట్ ద్వారా ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలానే మీ విలువైన వస్తువులు, బంగారం, వెండి, నగదు ఇంట్లో ఉంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళరాదని పోలీసులు తెలిపారు.