కొమరోలులో పలు కిరాణా దుకాణాలను మంగళవారం ఎస్సై నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో అక్రమంగా అనుమతులు లేకుండా దీపావళి ముందు సామాగ్రి నిలువ ఉంచరాదని దుకాణ యజమానులకు ఎస్ఐ సూచించారు. ఇటీవల వైజాగ్ లో దీపావళి మందు సామాగ్రి వల్ల జరిగిన అగ్ని ప్రమాదంపై వారికి వివరించి అవగాహన కల్పించారు. అనుమతులు లేకుండా దీపావళి ముందు సామాగ్రి నిలువ ఉంచితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.