కొమరోలు: చిగురించిన ప్రేమ వరుస కాకపోవడంతో..?

277చూసినవారు
కొమరోలు: చిగురించిన ప్రేమ వరుస కాకపోవడంతో..?
కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోని ఓ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది. నంద్యాల జిల్లాకు చెందిన భారతి, రాముడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు ఇద్దరు అన్నాచెల్లెళ్లు కావడంతో పెద్దలు మందలించి భారతికి సొంత బావతో వివాహం జరిపించారు. రాముడిని మర్చిపోలేని భారతి రెండు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటుంది. పెద్దలు తమని విడదీస్తారని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్