ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో మంగళవారం స్థానిక సీఐ మల్లికార్జున వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు వారికి జరిమానా విధించారు. ద్విచక్ర వాహనాన్ని నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చునే వ్యక్తి కూడా ఇక మీదట తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సిఐ మల్లికార్జున వాహనదారులకు ప్రజలకు సూచించారు.