ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 8 మందికి గిద్దలూరు కోర్టు షాక్ ఇచ్చింది. అర్ధవీడు మండలానికి చెందిన ఇద్దరికీ, బేస్తవారిపేట మండలానికి చెందిన ఐదుగురికి, కంభంకు చెందిన ఒకరికి గిద్దలూరు కోర్టు రూ. 10 వేలు జరిమానాతో పాటు మూడు రోజులు జైలు శిక్ష విధించింది. మద్యం తాగి వాహనం నడిపిన విషయంలో కోర్టు వీరికి శిక్ష, జరిమానా ఖరారు చేసినట్లుగా కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున మంగళవారం తెలిపారు.