ప్రకాశం జిల్లా కంభం మండలంలో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నట్లుగా శనివారం వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పొగాకు, మిర్చి, వినువు పంటలు నీట మునిగాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం పై అంచనా వేస్తున్నారు. సోమవారానికి పంట నష్టం పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. నష్టపరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.