పాఠశాలలకు దాతల సహకారం అభినందనీయం

58చూసినవారు
పాఠశాలలకు దాతల సహకారం అభినందనీయం
దాతల సహకారం అభినందనీయమని లక్ష్మీకోట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. వేణుగోపాలచారి అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీకోట ప్రాథమిక పాఠశాలలో దాత తాటికొండ. వెంకట్రావు సహకారంతో విద్యార్థులకు పలకలు, రాతపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు దాతను అభినందిస్తూ దాతృత్వం విద్యార్థులకు ఉపయుక్తమేగాక స్పూర్తినిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్