ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటి పల్లె గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. రాము అనే వ్యక్తికి చెందిన ఇంటిలో ప్రమాదవశాత్తు గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అవడం వల్ల మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్ లో గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.