గిద్దలూరు: నాగుపాము హల్చల్

74చూసినవారు
గిద్దలూరు: నాగుపాము హల్చల్
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం నల్లగట్ల గ్రామ సమీపంలోని ఓ నిర్మాణ ప్రదేశంలో ఏడు అడుగుల నాగుపాము శుక్రవారం హల్చల్ చేసింది. స్థానికులు గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పామును బంధించి నల్లమల అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని ప్రజలకు అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్