ప్రకాశం జిల్లా గిద్దలూరులోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు చెక్కులను పంపిణీ చేశారు. 19 మంది వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారికి రూ. 17 లక్షలకు పైగా నిధులు మంజూరు అయ్యాయని వారందరికీ నేడు చెక్కులను అందించామని ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆరోగ్య భద్రతకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.