ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎస్టీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంవత్సరంలోపు ప్రజలకు అమలు చేసిన హామీలను వివరించి తదుప ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సీఎం కల్పించబోతున్నారన్నారు.