వైద్యశాఖ అధికారులతో సమావేశమైన గిద్దలూరు ఎమ్మెల్యే

55చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని ప్రభుత్వ ఆసుపత్రి మీటింగ్ హాలులో గురువారం 6 మండలాల వైద్యశాఖ అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై అరా తీశారు. 104, 108 సర్వీసులు ప్రజలకు అందించే సేవలపై అడిగి తెలుసుకున్నారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేవరకు విశ్రమించేది లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్