రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా గిద్దలూరులో సోమవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అంబేద్కర్ ను కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పదని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు.