గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మహాత్మ జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని అశోక్ రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.