బుధవారం పొదిలిలో టీడీపీ మహిళలపై జరిగిన రాళ్లదాడి ఘటనపై గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లదాడికి పాల్పడడం సిగ్గుచేటని అశోక్ రెడ్డి అన్నారు. రాళ్ల దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళలు గాయపడడంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. రాళ్ల దాడికి పాల్పడ్డ అల్లరి మూకలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు.