ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కోటగడ్డ వీధిలో మంచినీటి కొళాయిల నుంచి మురుగునీరు రావడంపై గురువారం స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులుగా నీళ్లు ఇదేవిధంగా వస్తున్నాయని ఇంటి అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు పనికి రావని ప్రజలు తెలిపారు. నగర పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని 2 రోజులుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు.