ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కొమరోలు బస్టాండ్ సమీపంలో ఓ ఖాళీ స్థలంలో ఉంచిన పాత ద్విచక్ర వాహనాలు, వేస్ట్ మెటీరియల్ మంటల్లో కాలిపోయాయి. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేయడం వల్ల మంటలు చెలరిగాయి. కాలిపోయిన వాహనాలన్నీ కాలం చెల్లినవని పోలీసులు తెలిపారు. మంటలు వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఆస్తి నష్టం లేదని తెలిపారు.