ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఆకాశంలో అద్భుతం జరిగింది. బుధవార సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా స్థానికులు గురువారం తెలిపారు. వేలాదిగా ఎక్కడి నుంచో వచ్చిన పక్షుల గుంపు ఆకాశంలో విన్యాసాలు చేసింది. ఈ విన్యాసాలు చూసిన స్థానిక ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి విన్యాసాలు ఈ ప్రాంతంలో చూడలేదని అంటున్నారు. అంతరించిపోతున్న పిచ్చుక జాతికి చెందిన పక్షులు అత్యధికంగా కనిపించాయి.