ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తపల్లి సమీపంలో బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి కాలు విరిగినట్లుగా వైద్యులు తెలిపారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.