దొంగతనాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నరసింహారావు అన్నారు. బుధవారం స్థానిక అర్బన్ కాలనీలో దొంగతనాల పట్ల అవగాహన కలిగిస్తూ, దొంగలకు రాత్రి, పగలు తేడా ఉండదన్నారు. సమయానుకూలంగా అదును చూసి దోచుకుంటారన్నారు. అన్ని వేళల్లో అప్రమత్తంగా ఉంటూ, కొత్త వ్యక్తుల పట్ల అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.