గిద్దలూరు: గర్భం దాల్చిన మైనర్ బాలిక, ఓ వ్యక్తిపై కేసు నమోదు

79చూసినవారు
గిద్దలూరు: గర్భం దాల్చిన మైనర్ బాలిక, ఓ వ్యక్తిపై కేసు నమోదు
మైనర్ బాలిక గర్భం దాల్చిన విషయంలో ఓ అనుమానిత వ్యక్తిపై గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని 15 సంవత్సరాల మైనర్ బాలిక ఓ వ్యక్తి వల్ల గర్భం దాల్చిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శనివారం అర్బన్ సీఐ సురేష్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ అన్నారు. బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్