ప్రకాశం జిల్లా గిద్దలూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వీధిలో మంగళవారం ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఆడుకుంటూ ఇంటి వైపు వస్తున్న చిన్నారిపై అకస్మాత్తుగా వీధి కుక్కలు దాడి చేయడంతో స్థానికులు చిన్నారిని రక్షించారు. చిన్నారికి తీవ్రగాయం కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విధి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానిక ప్రజలు నగర పంచాయతీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.