కంభంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసి విభాగంలో 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన తమ్మినేని చాతుర్యను సోమవారం అభినందించారు. ఈ క్రమంలో సిఎల్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష మెమొంటోను అందించారు. సిఎల్ఆర్ జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం గుండాల ముక్తేశ్వరరావు, ఏనుగుల రవికుమార్ ఉన్నారు.