ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆటో డ్రైవర్లకు శుక్రవారం అర్బన్ సీఐ సురేష్ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలకు మించి ప్రయాణికులను తరలిస్తున్న ఆటో డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చారు. కొద్దిగా రోజులుగా అవగాహన కల్పిస్తున్న నిబంధనలు ఉల్లంఘించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరో మారు ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు.