ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సిఐ సురేష్ వాహనదారులకు శనివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులను తీవ్రంగా హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇక మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వాహనం నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని సిఐ సురేష్ అన్నారు.