ప్రకాశం జిల్లా గిద్దలూరు భారతీయ జనతా పార్టీ నాయకులు జనవరి 5వ తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం గిద్దలూరు పట్టణ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ కార్యక్రమ వివరాలను వివరించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు బిజెపి కార్యకర్తలతో తరలి వెళ్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు.