గిద్దలూరు: అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్

61చూసినవారు
గిద్దలూరు: అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అక్రమంగా మద్యం కలిగి ఉన్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి డిఫెన్స్ కు చెందిన 12 మద్యం ఫుల్ బాటిల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్రమంగా మద్యం నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ జయరావు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అక్రమంగా మద్యం కలిగి ఉండడం చట్టారీత్యా నేరమని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్