ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామంలో శుక్రవారం నాటు సారా కలిగి ఉన్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుండి ఒక్క లీటరు నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ జయరావు వెల్లడించారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.