గిద్దలూరు లోని ప్రణిల్ ఫాన్సీ మరియు గిఫ్ట్స్ దుకాణంలో ఫ్యాన్సీ వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చి రూ. 30, 000 విలువ చేసే 1 గ్రామ్ గోల్డ్ వస్తువులను, ఓ మహిళ, వృద్ధురాలు అపహరించి తీసుకువెళ్లారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సంఘటన జరగగా శనివారం దుకాణ యజమాని గుర్తించినట్లు తెలిపాడు. దుకాణంలో కొన్ని వస్తువులు కనిపించకపోవడంతో యజమాని సిసి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించగా విషయం వెలుగులోకి వచ్చింది.