గిద్దలూరు కోర్టు గురువారం చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష రూ. లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. జె. పంగులూరుకు చెందిన నాలి నాగార్జున కంభంకు చెందిన సోరకొండ శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద రూ. లక్ష అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించే విషయంలో చెక్కు ఇవ్వగా చెక్కు బౌన్స్ అయ్యింది. ఏడు సంవత్సరాల తర్వాత విచారణ అనంతరం న్యాయమూర్తి భరత్ చంద్ర శిక్షను ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చారు.