గిద్దలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

63చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బురుజుపల్లి గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గిద్దలూరు నుంచి బురుజు పల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రవి ముండ్లపాడు సమీపంలో బొలెరో వాహనాన్ని ఢీకొట్టాడు. రవికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్