గిద్దలూరు మండలంలోని కొమ్మునూరులో 4 రోజుల క్రితం విద్యుత్ ఘాతానికి గురై ధనురాజు అనే ప్రైవేట్ లైన్మెన్ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించగా అక్కడ వైద్యులు రూ. 10 లక్షలకు పైగా అతనికి ఖర్చు వస్తుందని తెలిపారు. విషయాలు తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 7 లక్షల 50 వేలు నగదును ధనురాజ్ కుటుంబ శనివారం సభ్యులకు వైద్యం కోసం అందించారు.