గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం యుటిఎఫ్ టీచర్స్ యూనియన్ ఏర్పాటు చేసిన సమావేశానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవలే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందిన మొర్రి. పిచ్చయ్యను అభినందించి తలపాగా తొడిగి, శాలువాతో, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతం ఉపాధ్యాయునికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందన్నారు.