గిద్దలూరు: వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే

73చూసినవారు
గిద్దలూరు: వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే
గిద్దలూరు నియోజకవర్గం వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. వర్షాకాలం నాటికి రైతులకు సబ్సిడీపై అందించే విత్తనాలపై వారితో చర్చించారు. రైతులకు ఇటీవల కాలంలో అందించిన పనిముట్లు అంశంపై మాట్లాడారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పంటకు బీమా చేసే అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్