గిద్దలూరు: తన రాజకీయ వారసుడు ఎవరో చెప్పేసిన ఎంపీ

569చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి మాగుంట కుటుంబం కట్టుబడి ఉందని ఎంపీ అన్నారు. తన అన్న సుబ్బరామిరెడ్డి తో పాటు వదిన పార్వతమ్మ నేను ప్రజ సేవలో తరించామని ఆ తర్వాత నా వారసుడు మాగుంట రాఘవరెడ్డి రాజకీయాలలోకి వస్తారని అన్నారు. మా కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానని ఎంపీ అన్నారు.

సంబంధిత పోస్ట్