గిద్దలూరు: రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎంపీ

202చూసినవారు
గిద్దలూరు పట్టణంలోని పాముల పల్లె రోడ్డు నిర్మాణ పనులను శనివారం స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి కొబ్బరికాయ కొట్టి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. కోటి 89 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎంపీ మాగుంట అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్