ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులును పిడుగురాళ్లకు బదిలీ చేస్తున్నట్లుగా మున్సిపల్ శాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గిద్దలూరు నూతన కమిషనర్ గా ఈవీ రమణబాబును నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రమణబాబు గతంలో నందిగామ మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుత కమిషనర్ గిద్దలూరు కమిషనర్ గా గత ఆరు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు.