గిద్దలూరు మండలం కొండపేట సమీపంలో సోమవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, ముగ్గు, పసుపు, కుంకుమతో పాటు మనిషి పుట్టిన పెట్టి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.