ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం శనివారం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కరపత్రాలు పంచి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఎంపీ మాగుంట వివరించారు.