గిద్దలూరు మండలం కొమ్మునూరు ప్రైవేటు విద్యుత్ లైన్ హెల్పర్ ధనురాజు తన రెండు చేతులు కోల్పోయాడు. 3 రోజుల క్రితం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ధనురాజును మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ధనురాజును రక్షించేందుకు వైద్యులు శుక్రవారం అతని రెండు చేతులను తొలగించారు. విద్యుత్ షాక్ తో రెండు చేతులు కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు.