గిద్దలూరు: సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

61చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో బుధవారం సిఐటియు నాయకులు, కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ ఏర్పాటు చేసిన లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నాయకులు, కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి 29 కార్మిక చట్టాలను సాధించుకున్నారని కేంద్ర ప్రభుత్వం వాటిని కాలరాస్తూ మార్చాలని చూడడం తగదని సిఐటియు నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్