ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం కురిసిన మోస్తారు వర్షానికి రహదారులు అన్ని జలమయంగా మారాయి. డ్రైనేజీ కాలువలలో చెత్తాచెదారాలు తొలగించకపోవడంతో వర్షపు నీరు వెళ్లేందుకు అవకాశంమే లేకుండా పోయిందని స్థానిక ప్రజలు అంటున్నారు. చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా నగర పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.