క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక టిడిపి నాయకులు కృష్ణ కిషోర్ రెడ్డి ఈ కబడ్డీ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. పోటీలలో విజయం సాధించే జట్లకు మొదటి బహుమతి రూ. 40, 2వ బహుమతి రూ.30, 3వ బహుమతి రూ.20, 4వ బహుమతి రూ.10 వేలు అందిస్తున్నట్లు కబడ్డీ పోటీల నిర్వాహకులు తెలిపారు.