గిద్దలూరు: గుండెపోటుతో టీడీపీ నాయకుడు మృతి

63చూసినవారు
గిద్దలూరు: గుండెపోటుతో టీడీపీ నాయకుడు మృతి
గిద్దలూరులో మంగళవారం గుండెపోటుతో సీనియర్ టీడీపీ నాయకుడు మృతి చెందాడు. పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ బాషా మంగళవారం గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలోనే ఒకసారి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయించినట్లు వివరించారు. ఆయన మృతితో పలువురు నాయకులు కార్యకర్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్