భారతదేశ సూపరిపాలనాధక్షుడు మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బీహారి వాజ్ పేయి శతజయంతి సందర్బంగా బుధవారం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరు తెలుగుదేశం నాయకులు వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జీవితాంతం నీతి, నిజాయితీ, నిరాడంబరతతో దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.