గిద్దలూరు: మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

85చూసినవారు
గిద్దలూరు: మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
గిద్దలూరులో సోమవారం గిద్దలూరు నంద్యాల రహదారిపై దుప్పల తిప్ప నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తర్వాత ట్రాక్టర్లను తాహాసిల్దార్ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై పోలీసులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్