గిద్దలూరులో ఆర్టీసీ బస్సుల డ్రైవర్ల వల్ల పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతూ వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ నడిమధ్య రోడ్డులో డ్రైవర్లు బస్సులు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం వాహనదారులు తెలిపారు. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని డిపో మేనేజర్ బస్సు డ్రైవర్లకు సూచనలు ఇచ్చి పట్టణంలో ట్రాఫిక్ కు అంతరం ఏర్పడకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.