ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట సమీపంలో ఫైర్ ఇంజిన్ ఢీకొని వీఆర్వో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. చట్రెడ్డిపల్లి వీఆర్వో గా పని చేస్తున్న లక్ష్మి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఫైర్ ఇంజిన్ వెనకనుంచి ఢీకొట్టింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎడమ చేయి విరిగినట్లుగా వైద్యులు వెల్లడించారు.